టిల్లు అన్న మళ్ళీ వచ్చాడు.. 'టిల్లు స్క్వేర్' ఫస్ట్ సాంగ్ అదిరింది!
on Jul 26, 2023

గతేడాది 'డీజే టిల్లు'తో సిద్ధు జొన్నలగడ్డ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. టిల్లుగా అతను చేసిన సందడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో, అందులోని 'టిల్లు అన్న డీజే పెడితే' పాట అంతకుమించిన విజయాన్ని సాధించింది. ఎక్కడ సెలబ్రేషన్ జరిగినా ఆ పాట వినిపించేది. ఇప్పుడు మరోసారి ఆ స్థాయిలో అలరించడానికి వచ్చేశాడు టిల్లు.
'డీజే టిల్లు'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'టిల్లు స్క్వేర్' లోనూ టిల్లుగా అలరించనున్నాడు సిద్ధు. తాజాగా ఈ చిత్రం నుంచి 'టికెటే కొనకుండా' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ విడుదలైంది. 'టిల్లు అన్న డీజే పెడితే' పాటను స్వరపరిచి, పాడిన రామ్ మిరియాలనే 'టికెటే కొనకుండా' పాటను కూడా స్వరపరచి, ఆలపించడం విశేషం. ఈ పాట కూడా ఆ పాట తరహాలోనే ఎనర్జిటిక్ గా, వినగానే కనెక్ట్ అయ్యేలా ఉంది. రామ్ మిరియాల మ్యూజిక్, సింగింగ్ లో ఎంత జోష్ ఉందో.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ కూడా అంతే క్యాచీగా ఆకట్టుకునేలా ఉన్నాయి. టిల్లు పాత్ర తీరుని తెలియజేస్తూ సాగిన ఈ పాట మెప్పిస్తోంది. ఈ సినిమాలో సిద్ధు సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. లిరికల్ వీడియోలో ఆమె లుక్, టిల్లుతో ఆమె సంభాషణ ఆకట్టుకున్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా పతకాలపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సాయి ప్రకాష్, ఆర్ట్ డైరెక్టర్ గా ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



