ఆగస్టులో మెగా కాంపౌండ్ మూవీస్ మేళా.. వరుసగా మూడు వారాల వినోదం!
on Jul 6, 2023

టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ హీరోల హవా మాములుగా ఉండదు. ఏడాదిలో డజను కి పైగా చిత్రాలు ఆ క్యాంపు నుంచే వచ్చేస్తుంటాయి. అలాంటిది.. ఈ సంవత్సరం ఆగస్టు లో అయితే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాయి. అది కూడా వరుసగా మూడు వారాల పాటు ఈ సినిమాలు విడుదల కానుండడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న 'భోళా శంకర్' సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. అది తెర పైకి వచ్చిన వారం తరువాత అంటే ఆగస్టు 18 న చిరు మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న 'ఆది కేశవ' వినోదాలు పంచనుంది. ఆపై వారం అంటే ఆగస్టు 25 న వరుణ్ తేజ్ కొత్త చిత్రం 'గాండీవధారి అర్జున' సందడి చేయనుంది. మరి.. వరుసగా మూడు వారాల పాటు తెరపైకి రాబోతున్న ఈ మెగా కాంపౌండ్ హీరోల టైటిల్ రోల్ మూవీస్.. బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.
కాగా 'భోళా శంకర్'కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా, 'ఆది కేశవ'ని డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి రూపొందిస్తున్నాడు. ఇక 'గాండీవధారి అర్జున'కి ప్రవీణ్ సత్తారు కెప్టెన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



