శ్రీలీల దూకుడు మాములుగా లేదసలు.. నెలకో సినిమాతో సందడే సందడి!
on Jul 6, 2023

`పెళ్ళి సందD', 'ధమాకా' చిత్రాలతో తెలుగు కుర్రకారుని ఫిదా చేసేసింది శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా హవా సాగిస్తున్న ఈ ఎనర్జిటిక్ యాక్ట్రస్ చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయి. వాటిలో స్టార్ హీరోల సినిమాలూ ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమాతోనూ పలకరించని శ్రీలీల.. సెకండాఫ్ లో మాత్రం ముచ్చటగా మూడు చిత్రాలతో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ మూడు చిత్రాలు కూడా వరుస నెలల్లో వెండితెరపై వినోదాలు పంచనున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగా యంగ్ సెన్సేషన్ పంజా వైష్ణవ్ తేజ్ కి జంటగా శ్రీలీల నటిస్తున్న 'ఆది కేశవ' మూవీ ఆగస్టు 18న సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన శ్రీలీల అభినయిస్తున్న పాన్ - ఇండియా ప్రాజెక్ట్ 'స్కంధ' సెప్టెంబర్ 15న థియేటర్స్ లోకి వస్తోంది. అదేవిధంగా నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో యాక్ట్ చేస్తున్న 'భగవంత్ కేసరి' అక్టోబర్ ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది.
మరి.. వరుసగా మూడు మాసాల పాటు నెలకో సినిమాతో పలకరించబోతున్న శ్రీలీల.. ఆయా ప్రాజెక్ట్స్ తో ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



