Home

»

Latest News

టాలీవుడ్‌కి ఏమైంది.. ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా!

Nov 21, 2026 2:01PM

టాలీవుడ్‌లో నవంబర్-డిసెంబర్‌ సినిమా క్యాలెండర్‌ ఒక్కసారిగా మారిపోయేలా కనిపిస్తోంది. వరుసగా మూడు క్రేజీ సినిమాలు వాయిదా పడుతున్నాయనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. రష్మిక మందన్న ‘మైసా’, నాగచైతన్య ‘వృషకర్మ’, నాగార్జున ‘కింగ్‌100’ సినిమాలు వాయిదా పడుతున్నట్లు సమాచారం. దీంతో నవంబర్‌ చివరి వారం నుంచి క్రిస్మస్‌ వరకు బాక్సాఫీస్‌ లెక్కలు మారే అవకాశం కనిపిస్తోంది.

ముందుగా రష్మిక నటిస్తున్న ‘మైసా’ విషయానికి వస్తే.. ఈ సినిమాను నవంబర్‌ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తేదీకి సినిమా రావడం లేదని సమాచారం. సెన్సార్‌ ప్రక్రియలో ఆలస్యం, ఫైనల్‌ కాపీ సిద్ధం కాకపోవడం.. వాయిదాకు కారణాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను డిసెంబర్‌ 4న విడుదల చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

ఇక నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ కూడా డిసెంబర్‌ 4 నుంచి వాయిదా పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేయాలని టీమ్‌ భావిస్తున్నట్లు సమాచారం. క్రిస్మస్‌ సీజన్‌లో కొత్త తేదీని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని టాక్‌ నడుస్తోంది.

మరోవైపు అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రతిష్ఠాత్మక వందో సినిమా ‘కింగ్‌100’ కూడా వాయిదా దిశగా వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని డిసెంబర్‌ 24న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే కొన్ని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్ పెండింగ్‌లో ఉండటంతో అనుకున్న తేదీకి రావడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. జనవరిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.

ఇది కూడా చదవండి: బాలకృష్ణకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం.!

ఈ సినిమాల షెడ్యూల్స్ మారడం వల్ల.. నందమూరి వర్సెస్ అక్కినేని బాక్సాఫీస్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారనుంది. నాగార్జున ‘కింగ్‌100’తో పాటు బాలకృష్ణ ‘దాదా’ కూడా డిసెంబర్‌ 24ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పుడు నాగార్జున సినిమా వాయిదా పడి, ఆ ప్లేస్ లో తనయుడు నాగచైతన్య సినిమా రానుందనే న్యూస్ వినిపిస్తోంది. అదే జరిగితే 'బాలయ్య vs నాగ్' ఫైట్ కాస్తా.. 'బాలయ్య vs చైతు'గా మారనుంది. 

మీకు నచ్చవచ్చు: 
వారణాసి వాయిదా.. బాల్ రాజమౌళి కోర్టులో లేదా.?
త్రివిక్రమ్‌ నెక్స్ట్‌ మూవీ.. చిరంజీవితోనా.. సూర్యతోనా.?

 

 

 

[Mysaa, Vrushakarma, King 100, Dada, Tollywood]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com