Home

»

Latest News

నితిన్ ప్రేమని అడ్డుకోలేకపోయిన కరోనా!

Jan 07, 2022

టాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మంచు మనోజ్, విశ్వక్ సేన్, మంచు లక్ష్మి, మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. తాజాగా యంగ్ హీరో నితిన్ భార్య షాలినికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని తాజాగా నితిన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

నితిన్ భార్య‌కు క‌రోనా సోకడంతో ఆమె హోం క్వారంటైన్ లో ఉంటున్నారు. అయితే ఇదే సమయంలో ఆమె పుట్టినరోజు ఉండటంతో 'కరోనాకి హద్దులు ఉంటాయి కానీ ప్రేమకు హద్దువు ఉండవు' అంటూ నితిన్ కేక్ కట్ చేసి తన ప్రేమని చాటుకున్నాడు. త‌న భార్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నితిన్ కేక్ క‌ట్ చేసి.. కిటికీలోంచి చూస్తున్న తన భార్యకు చూపిస్తూ కేక్ తిన్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన నితిన్.. "హ్యాపీ బర్త్ డే మై లవ్. లైవ్ లో ఫస్ట్ టైం నువ్వు నెగటివ్ కావాలని కోరుకుంటున్నాను" అని పోస్ట్ చేశాడు. నితిన్ తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com