తుఫాన్ వస్తోంది.. దాన్ని నేను ఫీలవుతున్నాను.. వైరల్ అయిన అఖిల్ పోస్ట్!
on Dec 27, 2021

అఖిల్ అక్కినేనికి 2021 తీపి గుర్తుగా నిలిచింది. ఈ ఏడాది కెరీర్‌లోనే తొలిసారిగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీతో సక్సెస్‌ను సాధించాడు. లవర్ బాయ్‌గా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో 'ఏజెంట్' అనే యాక్షన్ మూవీని చేస్తున్నాడు. ఈ ఏడాది జూలైలో హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్ర చేస్తుండటం ఈ చిత్రానికి సంబంధించిన విశేషం.
Also read: అఫీషియల్.. నవీన్, అనుష్క మూవీ అప్డేట్ వచ్చేసింది!
టైటిల్ రోల్ కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. సినిమా అంతా హల్క్ టైపులో మెలితిరిగిన కండలతో కనిపించడానికి జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ విషయంలో లేటెస్ట్‌గా షేర్ చేసిన ఓ ఫొటో ద్వారా అతను తెలియజేశాడు. జిమ్‌లో రెండు చేతులనూ పిడికిలి బిగించి కండలను చూపిస్తున్న ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన అఖిల్, దానికి "There is a storm coming. I can feel it #2022 " అనే క్యాప్షన్ పెట్టాడు.
Also read: 2021 జ్ఞాపకాలు: కిక్కెక్కించిన `ఐటమ్` సాంగ్స్!
గ్రే కలర్ ప్యాంట్, లైట్ బ్లూ కలర్ బనియన్ ధరించి, ముడివేసిన హెయిర్‌తో కొత్తగా కనిపిస్తున్నాడు అఖిల్. పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే ఆన్‌లైన్‌లో ఇది వైరల్‌గా మారింది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఇచ్చిన సక్సెస్ ఊపుతో 'ఏజెంట్'ను చేస్తున్న అఖిల్, ఈ మూవీతో బాక్సాఫీస్‌ను దున్నేస్తాననే నమ్మకంతో ఉన్నాడు. ఆ ఆత్మవిశ్వాసం అతను పెట్టిన పోస్టులో కనిపిస్తోంది. సాక్షి వైద్య హీరోయిన్‌గా పరిచయమవుతున్న 'ఏజెంట్'ను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ సమకూరుస్తోన్న ఈ మూవీ ఎప్పుడు రిలీజయ్యేదీ త్వరలో ప్రకటించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



