2022 స్పెషల్: జనవరి నుంచి ఏప్రిల్ వరకు తమన్ దే హవా!
on Dec 26, 2021

ఈ ఏడాది `క్రాక్`, `వకీల్ సాబ్`, `అఖండ` వంటి విజయవంతమైన చిత్రాలతో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాడు యువ సంగీత సంచలనం తమన్. ప్రస్తుతం దాదాపు డజను సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ కంపోజర్.. వచ్చే ఏడాది వరుస చిత్రాలతో సందడి చేయనున్నాడు. మరీముఖ్యంగా.. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతీ నెలలోనూ తమన్ సంగీతమందించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం `రాధే శ్యామ్` సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ సినిమాకి సంబంధించి దక్షిణాది వెర్షన్స్ కి తమన్ నేపథ్య సంగీతమందించాడు. ఇక ఫిబ్రవరిలో తమన్ స్వరకల్పనలో తయారవుతున్న `భీమ్లా నాయక్` రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది. అలాగే మార్చి 18న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తమన్ కలిసి పనిచేసిన స్పోర్ట్స్ డ్రామా `గని` తెరపైకి రానుంది. అదేవిధంగా ఏప్రిల్ 1న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో జట్టుకట్టిన `సర్కారు వారి పాట` సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది.
మరి.. `రాధే శ్యామ్`, `భీమ్లా నాయక్`, `గని`, `సర్కారు వారి పాట`.. ఇలా జనవరి నుంచి ఏప్రిల్ వరకు నెలకో సినిమా చొప్పున నాలుగు వరుస నెలల్లో తమన్ నుంచి రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్.. తనకి ఎలాంటి గుర్తింపుని, ఫలితాలను అందిస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



