
హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా.. బ్రేక్ ఈవెన్ సాధించలేక 'కమర్షియల్ ఫెయిల్యూర్స్'గా మిగలడం చూస్తుంటాం. అయితే నెగెటివ్ టాక్ తో హిట్ కొట్టే సినిమాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. రెండేళ్ల క్రితం వచ్చిన 'దేవర' సినిమా అలాంటి అద్భుతమనే చెప్పొచ్చు. ఇప్పుడు 'దేవర' సరసన 'ప్యారడైజ్' కూడా చేరేలా కనిపిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో 2024 సెప్టెంబర్ లో విడుదలైన 'దేవర' మూవీ మొదటి నుంచే డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎన్నో నెగెటివ్ కామెంట్స్ కనిపించాయి. ఆ నెగటివిటీని దాటుకొని రూ.400 కోట్లకు పైగా గ్రాస్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది దేవర. ఇప్పుడు రెండేళ్ల తర్వాత 'ప్యారడైజ్' రూపంలో అదే మ్యాజిక్ రిపీట్ అయ్యేలా ఉంది.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందిన 'ప్యారడైజ్' మూవీ, ఈ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ కనిపించాయి. కానీ ఆ టాక్, ఆ ట్రోల్స్ తో సంబంధం లేకుండా.. ప్యారడైజ్ మూవీ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఫస్ట్ వీకెండ్ లోనే థియేట్రికల్ బిజినెస్ లో దాదాపు 80 శాతం రికవర్ చేసింది. ఇదే జోరు కొనసాగితే.. త్వరలోనే బ్రేక్ ఈవెన్ అయినా ఆశ్చర్యంలేదు. అదే జరిగితే.. దేవర తర్వాత నెగెటివ్ టాక్ తో హిట్ కొట్టిన సినిమాగా ప్యారడైజ్ నిలుస్తుంది.
ఇది కూడా చదవండి: రామజోగయ్య శాస్త్రి గారి మాటలు బాధపెట్టాయి.. తమన్ షాకింగ్ కామెంట్స్.!

[Devara vs Paradise, Devara Collections, The Paradise Collections, Jr NTR Devara Movie, The Paradise Movie, Nani Paradise Movie, Telugu Film News, Telugu News]






