Home

»

Latest News

ఎందుకంత కక్ష: రామజోగయ్య శాస్త్రి గారి మాటలు బాధపెట్టాయి.. తమన్ షాకింగ్ కామెంట్స్.!

Sep 28, 2026 11:18AM

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్, ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కాంబినేషన్ అనగానే మనకు ఎన్నో చార్ట్‌బస్టర్ పాటలు గుర్తుకొస్తాయి. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, కెమిస్ట్రీ కేవలం పాటల్లోనే కాదు.. సినిమా వేదికలపై కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. ఇటీవల జరిగిన 'ఆదర్శ కుటుంబం' మూవీలోని 'నారాయణమ్మ' సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ ఈవెంట్ లో రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. "తమన్ గారు" అని సంబోధించారు. దాంతో ఆ తర్వాత వేదికపై మైక్ అందుకున్న తమన్.. రామజోగయ్య శాస్త్రికి కౌంటర్ ఇచ్చారు. "రామజోగయ్య శాస్త్రి గారు నన్ను 'తమన్ గారు' అని పిలిచారంటే.. ఆయన మనసులో నాపై ఏదో పెద్ద కక్ష పెట్టుకున్నారని అర్థం. పాటలోని సాహిత్యం సరిగ్గా వినిపించకపోతే ఆయనకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని మనసులోనే ఉంచుకుని నన్ను 'తమన్ గారు' అని చాలా పద్ధతిగా పిలుస్తారు" అని తమన్ సరదాగా వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, "ఆయన నన్ను అలా 'గారు' అని పిలిచినప్పుడల్లా నేను చాలా బాధపడతాను, నా మనసంతా హెవీ అయిపోతుంది" అంటూ తమన్ చేసిన కామెంట్స్‌కు వేదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. తమన్ వ్యాఖ్యలకు ఆడియన్స్‌లో కూర్చున్న రామజోగయ్య శాస్త్రి కూడా అంతే సరదాగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ నవ్వులు చిందించారు.

ఇది కూడా చదవండి: నారాయణమ్మ సాంగ్.. త్రివిక్రమ్ మ్యాజిక్ మిస్ అయిందా.?

 

 

 

[Thaman S vs Ramajogayya Sastry, Thaman Speech, Ramajogayya Sastry, Narayanamma Song Launch, Aadarsha Kutumbam Movie, Victory Venkatesh, Trivikram Srinivas, Dimple Hayati, Telugu Songs 2026]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com