Home

»

Latest News

వైరల్ గా మారిన న్యూస్: హనుమాన్ అంశ్ హీరో నిజజీవిత చరిత్ర ఇదే!

Sep 28, 2026 12:10PM

 

ఏ నిమిషం ఎవరి సినీ సుడి తిరుగుతుందో చెప్పడం కష్టం. పైగా ఎలాంటి సినీ  బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, అదీ కూడా కెమెరా వెనుక  అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ అనుకోకుండా ప్రధాన పాత్రలో నటించి ప్రపంచస్థాయి గుర్తింపు సాధించడం అత్యంత అరుదైన విషయం. ఏ జన్మలో అయినా పుణ్యం చేసుకొని ఉండాలి, లేదా ఏ దేవుడు అయినా తన కష్టాన్ని చూసి వీడికి ఎందుకు మనం సాయం చేయకూడదనైనా అనుకోని ఉండాలి. 


అచ్చం అలాంటి ఒక అద్భుతమైన నిజజీవిత కథే హనుమాన్ అంశ్ ఫేమ్ 'శోభినావ్ సత్య'ది. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా ఖైరాబాద్‌లో జన్మించిన శోభినావ్ సత్య, లక్నోలో పెరిగాడు. తండ్రి విద్యాశాఖ రిటైర్డ్ ఉద్యోగి, తల్లి ఉపాధ్యాయిని లక్నో విశ్వవిద్యాలయంలో చేరినా చదువుపై మనసు లగ్నం కాక, ఫైజాబాద్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేస్తూనే లక్నోలోని ఓపులెంట్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ అండ్ ఫిల్మ్స్‌లో నటనపై శిక్షణ పొంది, ఆ తర్వాత ప్రతిష్టాత్మక FTII పూణేలో కోర్సు పూర్తి చేశాడు.   చదువు పూర్తయ్యాక ముంబై సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శోభినావ్, మొదట్లో తెర వెనుక విభాగాలకే పరిమితమయ్యాడు. 'సి.ఐ.డి', 'రాగిణి ఎమ్ఎమ్‌ఎస్ రిటర్న్స్', 'హ్యాపీలీ ఎవర్‌ ఆఫ్టర్', 'మహాపోర్' వంటి ప్రసిద్ధ టీవీ మరియు ఓటీటీ ప్రాజెక్టులకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా, స్క్రిప్ట్ అండ్ కంటిన్యూటీ సూపర్‌వైజర్‌గా 10 ఏళ్లుకి పైగా పని చేసాడు.

ఒక నటుడిగా కంటే  దర్శకుడిగా ఎదగాలనేది కోరిక. ఈ క్రమంలోనే భక్తిరస చిత్రం 'హనుమాన్ అంశ' (Hanuman Ansh) ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు, దర్శకుడు విశాల్ చతుర్వేది వద్ద శోభినావ్ సత్య కేవలం అసిస్టెంట్ డైరెక్టర్‌గా  టీమ్‌లో చేరాడు. షూటింగ్ రెండు రోజుల్లో స్టార్ట్ అనగా, టైటిల్ రోల్(నీమ్ కరోలీ బాబా) అనుకున్న హీరో అస్వస్థతకి గుర్యయాడు. దీంతో మేకర్స్ కి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. కానీ  శోభినావ్‌లోని ప్రశాంతమైన హావభావాలు, ముఖకవళికలని దర్శకుడు విశాల్ చతుర్వేది గమించాడు. వెంటనే శోభినావ్‌కు సుదీర్ఘంగా 5 గంటల పాటు కఠినమైన స్క్రీన్ టెస్ట్ నిర్వహించాడు . ఆ స్క్రీన్ టెస్ట్‌లో అతడి సహజ సిద్ధమైన అభినయానికి ముగ్ధులైన మేకర్స్, కెమెరా వెనుక ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్‌ను ఏకంగా సినిమాలో నీమ్ కరోలీ బాబా ప్రధాన పాత్రకు కథానాయకుడిగా ఎంపిక చేశారు.   అయితే ఈ పవిత్రమైన పాత్రను పోషించడం శోభినావ్‌కి  అంత సులువు కాలేదు. 

 

 

ఇది కూడా చదవండి: నాలుగు రోజుల కలెక్షన్స్ ఇవే: హిట్టా, ఫట్టా!


చిన్నతనం నుంచే, అంటే 2009లో హైస్కూల్ చదువుతున్న సమయం నుంచే నీమ్ కరోలీ బాబా భక్తుడైన శోభినావ్, ఈ పాత్ర కోసం అత్యంత కఠినమైన సాత్విక నియమాలను పాటించాడు. ధూమపానం, మద్యం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక చింతనతో జీవించాడు. షూటింగ్ సమయంలో సెట్‌లో పాదరక్షలు లేకుండా  సంచరిస్తూ, మానసిక ప్రశాంతతను కాపాడుకుంటూ భక్తిశ్రద్ధలతో నటించాడు. తెరపై తన పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు తన వ్యక్తిగత జీవితాన్ని కూడా అత్యంత సాదాసీదాగా మార్చుకున్నాడు. ప్రస్తుతం హనుమాన్ అంశ్ జై భజరంగబలి అంటూ 400 కోట్లలోకి అడుగుపుట్టింది. బడ్జెట్ కేవలం రెండున్నర కోట్లు. తెలుగులో కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.

 

[Hamuman Ansh, Hanuman Ansh Actor Shobhinaw Satyaa Real Story,Shobhinaw Satyaa, Hanuman Ansh Collections, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com