'డార్క్ ఫేట్'తో సరికొత్త 'టెర్మినేటర్' వస్తున్నాడు!
on Sep 1, 2019

హాలీవుడ్‌లో నిర్మాణమైన 'టెర్మినేటర్' మూవీ సిరీస్ ఎంత పాపులరో మనకు తెలుసు. 1984లో 'ద టెర్మినేటర్' పేరుతో వచ్చిన తొలి సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో, దాన్ని ఒక ఫ్రాంచైజీగా మార్చేశారు. ఇప్పటికి ఆ సిరీస్‌లో 5 సినిమాలు వచ్చాయి. తొలి సినిమాలో ఆర్నాల్డ్ షార్జ్‌నెగ్గర్, లిండా హామిల్టన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ తర్వాత కూడా ఒక సినిమా మినహాయిస్తే, మిగిలిన అన్ని సినిమాల్లోనూ ఆర్నాల్డ్ ప్రధాన పాత్ర పోషించాడు. తొలి రెండు సినిమాల్లో కలిసి నటించిన ఆర్నాల్డ్, లిండా మళ్లీ ఇప్పుడు వస్తోన్న 'టెర్మినేటర్' సిరీస్‌లోని ఆరో సినిమా 'టెర్మినేటర్: డార్క్ ఫేట్'లో కలిసి నటించడం విశేషం. అప్పట్లో యంగ్‌గా కనిపించిన ఆ ఇద్దరూ ఇప్పుడు వృద్ధులయ్యారు.
'డెడ్‌పూల్' డైరెక్టర్ టిం మిల్లర్ డైరెక్ట్ చేసిన 'టెర్మినేటర్: డార్క్ ఫేట్' మూవీ ట్రైలర్‌ను నిర్మాతలు యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉంది. డెవిడ్ ఎల్లిసన్‌తో కలిసి సుప్రసిద్ధ దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ట్రైలర్ ప్రకారం చూస్తే, గత మూడు సినిమాల స్టోరీలైన్‌తో పోలిస్తే, భిన్న కథతో ఈ మూవీ వస్తున్నట్లు స్పష్టమవుతోంది. నటాలియా రేయస్ పోషించిన డాని రమోస్ అనే యువతిని టెర్మినేటర్ (గాబ్రియేల్ లునా) నుంచి సారా కానర్ (లిండా హామిల్టన్), టి-800 (ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్), గ్రేస్ (మెకంజీ డేవిస్) ఎలా కాపాడారనేదే ఈ మూవీలోని ప్రధానాంశం.

నవంబర్ 1న ఇంగ్లీష్, హిందీ వెర్షన్లతో పాటు తెలుగులోనూ 'టెర్మినేటర్: డార్క్ ఫేట్' విడుదలవుతోంది. అలాగే దక్షిణాదిలోని మిగతా మూడు భాషలు.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాని ట్వంటీయెత్ సెంచరీ ఫాక్స్ రిలీజ్ చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



