'సాహో' బాక్సాఫీస్: హిందీకి రివర్స్‌లో తెలుగు వెర్షన్!
on Sep 1, 2019

'సాహో' మూవీ హిందీ వెర్షన్ కలెక్షన్లు అక్కడి ట్రేడ్ విశ్లేషకులతో పాటు, మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేస్తుండగా, మన తెలుగు వెర్షన్ మాత్రం అందుకు రివర్స్‌లో ప్రయాణిస్తోంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ టాలీవుడ్‌కు బ్రాండ్ అంబాసడర్‌గా మారిన ప్రభాస్ టైటిల్ రోల్ చేసిన 'సాహో' తెలుగు వెర్షన్ నెగటివ్ టాక్‌లోనూ తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 36 కోట్ల షేర్ సాధించిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు ఆ వసూళ్లు మూడో వంతుకు పైగా పడిపోయాయి. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం 'సాహో' తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.20 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇందులో ఒక్క నైజాం వాటాయే రూ. 5.20 కోట్లు ఉండటం గమనార్హం. ఇదే ఏరియాలో మొదటి రోజు రూ. 9.40 కోట్ల షేర్ వచ్చింది.
ఆంధ్రా ఏరియాలో వసూళ్లు మొదటి రోజుతో పోలిస్తే బాగా తగ్గినట్లు స్పష్టమవుతోంది. రాయలసీమ మినహాయిస్తే, ఆంధ్రలోని ఏ ఏరియాలోనూ 'సాహో' షేర్ రూ. కోటి మార్కును చేరుకోలేదు. రెండు రోజుల్లో రూ. 46.20 కోట్ల షేర్ వచ్చింది. ఆదివారం, సోమవారం సెలవు రొజుల కాబట్టి.. ఈ రెండు రోజుల్లోనూ చెప్పుకోదగ్గ షేర్ వచ్చే అవకాశం ఉంది. మంగళవారం నుంచి కలెక్షన్లు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు వెర్షన్‌కు సెప్టెంబర్ 13 వరకు పోటీయే లేదు కాబట్టి ఈ లోగా సాధ్యమైనంత వసూళ్లను సాధించడమే 'సాహో' లక్ష్యంగా పెట్టుకున్నాడు. సోమవారం తర్వాత కానీ తెలుగు వెర్షన్ వాస్తవ స్థితి ఏమిటనే అంచనాకు రాలేం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



