భగీరథ రచించిన ఎన్టీఆర్ పుస్తకానికి కీర్తి పురస్కారం
on Mar 24, 2023

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్టు భగీరథ వ్రాసిన "మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్.టి ఆర్" అన్న పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. జీవిత చరిత్ర విభాగంలో "మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్.టి ఆర్" పుస్తకాన్ని ఎంపిక చేసినట్టు గురువారం నాడు ఉపాధ్యక్షులు టి. కిషన్ రావు తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం ఈ నెల 29న తెలుగు విశ్వవిద్యాలయం లో జరగనుంది.
ఇప్పటికే "మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్.టి ఆర్" పుస్తకానికి కమలాకర కళాభారతి మరియు ఎన్.టి.ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డులు లభించాయి. తాను రచించిన ఎన్.టి.ఆర్ జీవిత చరిత్ర పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించడం పట్ల భగీరథ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్.టి.ఆర్ శత జయంతి సందర్భంగా ఆయన జీవితం మీద వ్రాసిన ఈ పుస్తకానికి ఎన్.టి.ఆర్ నెలకొల్పిన తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం లభిస్తుందని ఊహించలేదని భగీరథ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



