‘కుబేర’ పరిస్థితి మూన్నాళ్ల ముచ్చట కాబోతోందా?.. అసలేమైంది?
on Jun 24, 2025
సెన్సిబుల్ కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చిన శేఖర్ కమ్ముల.. తాజాగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చాడు. కింగ్ నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో ‘కుబేర’ చిత్రాన్ని రూపొందించారు. ఇద్దరు స్టార్ హీరోలతో శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఎక్స్‌పెక్టేషన్స్ భారీగానే పెరిగాయి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ‘కుబేర’ మొదటిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. దీంతో మేకర్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అన్నీ ఫుల్స్‌తో రన్ అయ్యాయి. వీకెండ్‌లో అన్ని ఏరియాలు కలిపి 80 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సినిమాకి మంచి టాక్ రావడం, కలెక్షన్లు కూడా బాగానే ఉండడంతో ‘కుబేర’ యూనిట్ ఆ హ్యాపీ మూమెంట్‌ని సెలబ్రేట్ చేసుకుంది.
ఇదిలా ఉంటే.. తెలుగులో మంచి టాక్‌తోపాటు మంచి రివ్యూలు కూడా సొంతం చేసుకున్న కుబేర తమిళ్‌లో మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని సాధించలేదు. ఇది నిర్మాతల పాలిట పెద్ద షాక్‌గా మారింది. తమిళ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ధనుష్ సినిమాకి కలెక్షన్స్ లేకపోవడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. సోమవారం నుంచి అక్కడి కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. తెలుగులో మాత్రం మంచి కలెక్షన్స్‌తో రన్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సినిమాను నిలబెట్టేందుకు దర్శకనిర్మాతలు ఏం చెయ్యబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. సినిమా బాగుందనే టాక్ వచ్చింది కాబట్టి దాన్ని మరింత ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత చిత్ర యూనిట్‌పై ఉంది. ఇప్పుడు ఇతర భాషల్లో సినిమాకి వస్తున్న టాక్ చూస్తుంటే ప్రమోషన్ల విషయంలో అక్కడ ఏదైనా లోపం జరిగిందా అనే కోణంలో కూడా చిత్ర యూనిట్ ఆలోచిస్తోందని సమాచారం. తమ ప్రమోషన్స్‌తో తమిళ్ ప్రేక్షకుల్ని తట్టి లేపాల్సిన అవసరం ఉంది. మరి ‘కుబేర’ను అన్ని భాషల్లో నిలబెట్టడానికి దర్శకనిర్మాతలు ఎలాంటి ప్లాన్ వేయబోతున్నారో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
