ఎట్టకేలకు త్రివిక్రమ్ సినిమాకి ముహూర్తం ఖరారు!
on Jun 24, 2025
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ, త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి సినిమాల్లో నటించాడు వెంకీ మామ. ఈ సినిమాలు ఆల్ టైం ఎంటర్టైనర్స్ గా పేరు పొందాయి. ఇప్పటికీ ఈ చిత్రాలను ఆడియన్స్ రిపీటెడ్ గా చూస్తుంటారు. అందుకే వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే చూడాలని ఎందరో ఆశ పడుతున్నారు. అభిమానుల కోరిక త్వరలోనే తీరబోతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ మామ ఓ మూవీ చేయబోతున్నాడు.
ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని అందుకొని వెంకటేష్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. దీంతో దాని తర్వాత వెంకీ మామ చేయబోయే సినిమా ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇలాంటి టైంలో అనూహ్యంగా త్రివిక్రమ్-వెంకటేష్ కాంబో తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు సినిమాలు వెంకటేష్, ఎన్టీఆర్ తో ఉంటాయని ఇప్పటికే నిర్మాత నాగవంశీ కూడా తెలిపాడు. అందుకు తగ్గట్టుగానే ముందుగా వెంకీ మామ మూవీ పట్టాలెక్కుతోంది. ఆగస్టులో ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.
వెంకటేష్ ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు త్రివిక్రమ్. ఇది భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్. గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి కథతో ఇది తెరకెక్కనుంది.
ఎన్టీఆర్ ఈ ఆగస్టులో వార్-2 తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే జూన్ 25న విడుదల కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందేమో చూడాలి. మరోవైపు దేవర-2, డైరెక్టర్ నెల్సన్ ప్రాజెక్ట్ కూడా ఎన్టీఆర్ చేతిలో ఉన్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
