కేన్సర్‌తో చావుబతుకుల మధ్య పాపులర్ గేయరచయిత
on Jun 10, 2021

అలతి అలతి పదాలతో అద్భుతమైన పాటలు రాసి తెలుగు సినీరంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గేయరచయిత కందికొండ. ప్రస్తుతం ఆయన ఆరోగ్య స్థితి ఆందోళనకరంగా ఉండటం సంగీతప్రియులందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పదిహేనేళ్ల క్రితం క్సాన్సర్ బారిన పడిన కందికొండ కోలుకున్నట్టే కోలుకొని, ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. కష్టపడి చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో పీ.హచ్.డి పూర్తి చేసి.. పాటలోనే తన జీవితాన్ని చూసుకున్న కవి కందికొండ. వెయ్యికి పైగా పాటలు రాసిన ఆయన కెరియర్ లో.. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలోని ‘మళ్లీ కూయవే గువ్వ’, పోకిరి సినిమాలోని ’గలగల పారుతున్న గోదారిల', అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలోని ’చెన్నై చంద్రమా‘ వంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. సినిమా సాహిత్యం ఒక ఎత్తయితే కందికొండ రాసిన సామాజిక గీతాలు మరొక ఎత్తు. బతుకమ్మ, బోనాల పండుగలకు, రాష్ర్ట అవతరణ వేడుకలకు కందికొండ రాసిన పాటలు జనాల్లో విశేష ఆదరణ పొందాయి. ఇలా వందల పాటలతో సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన కందికొండ.. ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు.
పదిహేనేళ్ల క్రితం క్సాన్సర్ బారిన పడిన కందికొండ కోలుకున్నట్టే కోలుకొని.. ఇప్పుడు మళ్ళీ చావుతో పోరాడుతున్నారు. దీంతో ఆయన్ని కాపాడుకోవడానికి దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయాలని ఆయన మిత్రులు కోరుతున్నారు. గత కొన్ని రోజుల నుండి హస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నందున పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందట. వెంటిలేటర్, మెడిసిన్స్, బెడ్ ఛార్జెస్ అన్ని కలిపి రోజుకి 70 వేలకు పైగా అవుతున్నాయట. మనకి తోచిన ఆర్థిక సహయం చేసి.. సరస్వతి పుత్రుడిని కాపాడుకుందాం అంటూ ఆయన మిత్రులు సన్నిహితులు కోరుతున్నారు.
కందికొండకు దాతలు ఎవరైనా సహాయం చేయాలనుకొంటే.. ఆయన భార్య కందికొండ రమాదేవి గూగుల్ పే & ఫోన్ పే నెంబర్ 8179310687 తమకు తోచిన విధంగా సాయం చేయవచ్చు.
Andhra Bank Account Details:
Kandikonda Rama Devi
Account No: 135510100174728,
IFSC Code: ANDB0001355.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



