తీవ్ర గుండెపోటుతో అపస్మారక స్థితిలో తారకరత్న
on Jan 27, 2023
నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. శుక్రవారం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. పల్స్ రేట్ పడిపోవడంతో వెంటనే ఆయనను కుప్పంలోని హాస్పిటల్‌కు తరలించి అత్యవసర చికిత్స అందించారు. విషయం తెలియగానే హీరో బాలకృష్ణ హుటాహుటిన హాస్పిటల్‌కు చేరుకొని, ఆయన ఆరోగ్య స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
తారకరత్న అపస్మారక స్థితి నుంచి బయటకు రాకపోవడంతో ఆయనను మరింత మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య స్థితి పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.
కాగా నిన్నటి నుంచి నారా లోకేష్ వెంట ఉండి పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు తారకరత్న. బాలకృష్ణ కూడా పాల్గొన్న పాదయాత్రలో పెద్ద మొత్తంలో జనం హాజరవడం.. కాస్త తోపులాట జరగడంతో తారకరత్నకు ఊపిరి సలపలేదని సమాచారం. ఈ క్రమంలోనే ఆయన సొమ్మసిల్లి పడిపోయారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
