పవన్ గురించి తమ్మారెడ్డి చెప్పిన నిజాలు
on May 5, 2014

జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ పై ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. "ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాను అని చెప్పావు. అసలు ప్రశ్నించడమంటే ఇదేనా ? ప్రశ్నించడం అంటే తిట్టడమేనా? చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతంగా ప్రవర్తించాలి. తెలియని వారికీ మంచి నేర్పాలి కానీ బూతులు తిట్టాలని కోరుతున్నావేంటి? రాజకీయం అంటే ఓర్పు, సహనం. కానీ నీలో అది ఎక్కడా కూడా కనిపించడం లేదు. విచక్షణ కోల్పోయి స్టేజ్ మీద ఊగిపోతున్నావ్. ఎంతసేపు విప్లవ సాహిత్యం చదివాను.. నాలో పౌరుషం కట్టలు తెంచుకుంటోందంటూ ఏవో సినిమా డైలాగులు రాసుకొని వచ్చి వాటినే చెబుతున్నావ్. అసలు టీఆర్ఎస్, వైకాపా పార్టీలను విమర్శించాల్సిన అవసరం ఏముందో తెలియడం లేదు. ముందు నువ్వు ఆత్మ విమర్శ చేసుకో. అసలు నువ్వు ప్రజలకు ఏం చేయాలని అనుకుంటున్నావో ఆ విషయాన్ని చెప్పాలి కానీ, వాళ్ళని తిట్టు, వీళ్ళని తిట్టు అని చెప్పడం అనవసరం" అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



