పగలు గోపితో, రాత్రి మనోజ్ తో రొమాన్స్
on May 5, 2014
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు పెద్ద చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉంది.
గోపీచంద్ హీరోగా ఇటీవలే ఓ చిత్రం ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఇందులో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మంచు మనోజ్ తో కూడా ఓ సినిమాలో నటిస్తుంది. ఈ రెండు చిత్రాల షూటింగ్ లు శరవేగంగా జరుగుతున్నాయి. దాంతో రెండు సినిమాల షూటింగ్ ల సమయాన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని, షూటింగ్ లో పాల్గొంటుంది.
ఉదయం గోపీచంద్ సినిమా షూటింగ్ లో పాల్గొని, రాత్రివేళలో మనోజ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతుంది. ఇలా ఇద్దరు హీరోల మధ్య నలిగిపోతున్న ఈ అమ్మడికి విశ్రాంతి తీసుకోవడానికి కూడా క్షణం తీరిక లేకుండా ఉందని బాధపడుతుందట. కానీ ఈ సినిమాలు మంచి విజయం సాధిస్తాయనే నమ్మకం ఉందట ఈ అమ్మడికి. చూద్దాం.. ఈ అమ్మడి కష్టానికి ప్రతిఫలం ఎలా ఉండబోతుందో.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
