ప్రభుదేవా కాబట్టే భరత్‌కు ఛాన్స్
on Nov 8, 2019

సల్మాన్‌ఖాన్‌తో హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి విభేదాలు రావడంతో ప్రభుదేవాకు కలిసొచ్చింది. అతడికి మాత్రమే కాదు... తమిళ నటుడు, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్‌కి కూడా! ప్రభుదేవా దర్శకత్వంలో 'దబాంగ్ 3' చేస్తున్నప్పుడు, భనాల్సీతో సల్మాన్‌కు గొడవలొచ్చాయి. 'ఇన్‌షా అల్లా' క్యాన్సిల్ చేసి, ప్రభుదేవాకి మరో సినిమా 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకు ఇటీవల క్లాప్ కొట్టినా... గ్రౌండ్ వర్క్ ఎప్పటినుండో జరిగింది. ఇప్పుడీ సినిమాలో తమిళ నటుడు భరత్‌కి నటించే ఛాన్స్ ఇచ్చాడు ప్రభుదేవా. సౌతిండియన్ ఆడియన్స్‌కు, ఆఖరికి భరత్‌కు కూడా ఈ న్యూస్ సర్‌ప్రైజ్ అనే చెప్పాలి.
భరత్‌కి హిందీ సినిమాలో ఛాన్స్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. అతడూ చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఈ న్యూస్‌ను ట్వీట్ చేశాడు. "ఇండియన్ సినిమా మోస్ట్ వాంటెడ్ భాయ్‌తో నటించాలనే కల నిజమైంది. ప్రభుదేవాకు థ్యాంక్స్. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అన్నాడు భరత్. ప్రభుదేవా కాకుండా మరో దర్శకుడు అయితే భరత్‌కు ఛాన్స్ వచ్చేది కాదు. ఇద్దరూ చెన్నై బ్యాచ్. లోకల్ ఫీలింగ్ కలిపింది. సినిమాలో ఛాన్స్ వచ్చేలా చేసింది. అదీ మేటర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



