'సామజవరగమన' పాటను పారిస్‌లో తీస్తున్నారు!
on Nov 8, 2019

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌తో తయారవుతున్న 'అల.. వైకుంఠపురములో' సినిమాలో 'సామజవరగమన' సాంగ్ ఏ రేంజిలో హిట్టయిందో మనకు తెలుసు. ఆ మధ్య విడుదల చేసిన ఈ సాంగ్ ఆన్‌లైన్ వ్యూస్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించి మోస్ట్ వాచ్డ్ సాంగ్ ఇన్ సౌత్ ఇండియాగా నిలిచింది.. తమన్ స్వరాలు కూర్చగా సీతారామశాస్త్రి ఆ పాటను రాశారు. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్ సాంగ్‌ను ప్రస్తుతం పారిస్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. హీరో హీరోయిన్లు అల్లు అర్జున్, పూజా హెగ్డేపై తీస్తున్న ఈ పాటకు శేఖర్ కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'అల వైకుంఠపురములో' ప్రేక్షకుల ముందుకు రానుంది.
టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్‌కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్రకని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ తారాగణమైన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.ఎస్. వినోద్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



