తమన్నాకు నలుపు-తెలుపు సెగ!
on Jun 6, 2020

తమన్నాకు నలుపు తెలుపు సెగ తగులుతోంది. కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మిల్క్ బ్యూటీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అమెరికాలో ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా, నల్ల జాతీయులపై జాత్యహంకార దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఆందోళనలకు తమన్నా మద్దతు పలికారు. పాలరాతి శిల్పంలా మెరిసిపోయే ఆమె ముఖంపై... నల్లటి అరచేయి నోటిని నొక్కుతున్న ట్లుగా మేకప్ వేసుకుని అందరి జీవితాలు ముఖ్యమే అని సందేశం ఇచ్చారు.
తమన్నా చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. అయితే, గతంలో సౌందర్య ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలో తమన్నా నటించారు. ఫెయిర్నెస్ క్రీమ్‌కి ప్రచారం చేశారు. మిల మిల మెరిసే చర్మం కోసం ఫలానా క్రీమ్ వాడమని చెప్పడం వర్ణవివక్ష కిందకే వస్తుందనీ, ఒకప్పుడు అటువంటి ప్రకటనలో నటించిన తమన్నా ఇప్పుడు ఈ విధంగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందనీ కొందరు ఆమెను విమర్శిస్తున్నారు. తమన్నాకు మాత్రమే కాదు నల్ల జాతీయుల నిరసనలకు మద్దతు తెలిపిన పలువురు కథానాయికలకు ఇటువంటి సెగ తప్పడం లేదు. గతంలో బ్యూటీ ప్రోడక్ట్స్ కి ప్రచారం చేసిన 'మీరు మాకు చెప్పడం ఏంటి?' అని హీరోయిన్లను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



