ఆ అకౌంట్ బాలయ్యది కాదు!
on Jun 6, 2020

రెండు నెలలుగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ సమయంలో కొందరు ఖాళీగా ఇంట్లో కూర్చున్నట్టు ఉన్నారు. ఏం చేయాలో తోచక సెలబ్రిటీల ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు క్రియేట్ చేస్తూ... తెలుగు సినీ ప్రేక్షకులను అయోమయానికి గురి చేస్తున్నారు. ఇటీవల రావు రమేష్ పేరు మీద ఎవరో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో... ఆ ట్విట్టర్ అకౌంట్ తనది కాదంటూ ఆయన మీడియాకు వివరణ ఇస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రావు రమేష్ తరహాలోనే ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను పేరు మీద కూడా ఎవరో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు మీద ట్విట్టర్ లో అకౌంట్ కొత్తగా వచ్చింది.
ఈ ఏడాది నందమూరి బాలకృష్ణ 60వ పడిలో అడుగు పెడుతున్నారు. ఆయన షష్టిపూర్తి సంవత్సరం కావడంతో అభిమానులు ట్విట్టర్ ట్రెండ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంలో కామన్ డీపీ విడుదల చేశారు. ఇదే అదునుగా ఎవరో ఎన్‌బీకేఏ అఫిషియల్ పేరుతో ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేశారు. నిజంగా నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియా సైట్ లలో ఒకటైన ట్విట్టర్లో అడుగుపెడుతున్నారా అని ఆరా తీయగా ఫేక్ అని తెలిసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



