రవితేజతో సినిమానా?.. కొన్ని రోజులు ఆగండి..!
on Mar 28, 2020

మాస్ మహారాజా రవితేజ, మిల్కీ బ్యూటీ తమన్నా జోడిగా నటించిన 'బెంగాల్ టైగర్'కి ఆశించిన విజయం దక్కలేదేమో! సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. అయితేనేం... రవితేజ, తమన్నా జోడి బ్లాక్ బస్టర్ హిట్. 'చూపులతో దీపాల...' పాటల్లో వీరిద్దరి కెమిస్ట్రీ సూపరో సూపర్ అన్నారంతా! ఈ జోడీని రిపీట్ చేయడానికి దర్శకుడు త్రినాథరావు నక్కిన ప్రయత్నిస్తున్నారు.
రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుందనే సంగతి తెలిసిందే. రవితేజ శైలికి సరిపోయే వినోదాత్మక కథను త్రినాథరావు నక్కిన ఆస్థాన రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ రాశారు. ప్రస్తుతం రవితేజ, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న 'క్రాక్' పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇందులో తమన్నాను కథానాయికగా తీసుకోవాలనుకున్నారు. అదే మాట ఆమెను అడిగితే... "ప్రజెంట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొన్ని రోజులు ఆగితే క్లియర్ కట్‌గా చెప్తా" అని అన్నారు. రవితేజతో చేయట్లేదని చెప్పలేదు. అంటే... ఈ సినిమాలో ఆమె నటించడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ సరసన 'సిటీమార్' చేస్తున్నారామె.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



