నేనే చెప్తా ఇక మీరు ఆపండి - తమన్నా
on Jul 28, 2018

నటుడు,క్రికెటర్,డాక్టర్... ఇదంతా చూసి ఎవరు ఆ వ్యక్తి అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే , ఇవన్నీ తమన్నా పలానా వాణ్ణి పెళ్లి చేసుకోబోతుంది అని వచ్చిన కథనాలు. ఓసారి నటుణ్ని ,మరోసారి క్రికెటర్ని ఇప్పుడు ఏకంగా అమెరికా కి చెందిన ఓ డాక్టర్ని పెళ్లి చేసుకుంటుందని జరిగిన ప్రచారం.అయితే ఈ ప్రచారంపై తమన్నాట్విటర్ వేదికగా ప్రకటన విడుదల చేశారు.‘ఓ రోజు నటుడు, మరో రోజు క్రికెటర్, ఇప్పుడు వైద్యుడు. ఈ వదంతులన్నీ చూస్తే నేను భర్త కోసం షాపింగ్ చేస్తున్నట్లు అందరికీ అనిపిస్తుంది. ప్రేమ అనే అనుభూతిని నేను ఇష్టపడతాను. కానీ, నా వ్యక్తిగత జీవితం గురించి ఆధారాలు లేని వార్తలు రాస్తే ఒప్పుకోను. నేను సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నా. నా తల్లిదండ్రులు పెళ్లి కొడుకు కోసం వెతకడం లేదు. ప్రస్తుతం నేను నా సినిమాలతో ప్రేమలో ఉన్నా.
ఈ వదంతులు ఎక్కడి నుంచి వస్తాయో నాకు ఏ మాత్రం అర్థం కావడం లేదు’.‘ఇది గౌరవప్రదమైన పని కాదు.నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నేనే స్వయంగా ఈ ప్రపంచానికి తెలియజేస్తా.మరోసారి ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా. నా పెళ్లి ఇప్పటి వరకు నిశ్చయం కాలేదు. ఆధారాలు లేకుండా వస్తున్న వార్తలకు ఇక స్వస్తి పలకండి. ఇది కొందరి ఊహాజనిత కథనం మాత్రమే’ అని తమన్నా పేర్కొన్నారు.పెళ్లి విషయంలో తమన్నాకి లేని తొందర ఇలా ప్రచారం చేసేవాళ్ళకి ఎందుకో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



