మరో కాంట్రవర్సీలో అర్జున్ రెడ్డి
on Jul 28, 2018

అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు హీరో విజయ్ దేవరకొడ.యూత్ సెన్షేషన్ స్టార్ గా మారిపోయాడు. విజయ్ ఎంచుకునే సినిమాలన్నీ చాలా ఆసక్తిగా ఉంటున్నాయి.ఇతడి లేటెస్ట్ సినిమా ‘గీతాగోవిందం’. త్వరలో విడుదల కానున్నఈ సినిమాలో వాట్ ద ఎఫ్ అనే పాట విజయ్ పాడాడు.ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. విజయ్ యూత్‌ను ఆకట్టుకునేలా ఈ పాటను పాడాడు అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.ఇలాంటి సమయంలో పాటలోని పదాలు మహిళలను మరియు హిందూ మతస్తులను అవమానించేలాగా, మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయి అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి.
రాముడు, సీత గురించి ఇంకా ఆడవారి గురించి అవమానకరంగా ఉన్న ఆ పదాలను తొలగిస్తాం అంటూ సదరు పాట రచయిత శ్రీమణి ప్రకటించాడు. పాట వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి, వెంటనే ఆ పాటలోని అభ్యంతరకర పదాలను తొలగించేస్తాం అంటూ ప్రకటించాడు.త్వరలోనే కొత్త వర్షన్ పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.మార్పు చేసిన పాటను కూడా విజయ్‌తోనే పాడిస్తారా?లేదా?అనేది తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



