కాస్త ముందుగానే ఓటీటీలోకి 'స్వాతి ముత్యం'!
on Oct 20, 2022

దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన 'స్వాతి ముత్యం' చిత్రం పాజిటివ్ టాక్ తెచుకున్నప్పటికీ అదేరోజున విడుదలైన 'గాడ్ ఫాదర్', 'ది ఘోస్ట్' చిత్రాల కారణంగా ఆదరణకు నోచుకోలేకపోయింది. ముఖ్యంగా 'గాడ్ ఫాదర్' ఈ చిత్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో దసరాకు థియేటర్స్ విడుదలైన 'స్వాతి ముత్యం' మూడు వారాలు కూడా తిరగకుండానే దీపావళికి ఓటీటీలోకి వచ్చేస్తోంది.
బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'స్వాతి ముత్యం'. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మంచి టాక్ తెచ్చుకుంది కానీ వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని ఆహా దక్కించుకుంది. నిజానికి ఈ చిత్రాన్ని అక్టోబర్ 28 నుంచి ప్రదర్శించాలి అనుకున్నారు. కానీ ప్రేక్షకుల నుంచి వస్తున్న డిమాండ్స్ కారణంగా దీపావళి కానుకగా అక్టోబర్ 24 నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా ప్రకటించింది.

ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో రావు రమేష్, నరేష్, గోపరాజు రమణ, ప్రగతి, సురేఖ వాణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



