జపాన్ లో యంగ్ టైగర్ క్రేజ్.. తగ్గేదేలే!
on Oct 20, 2022

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి జపాన్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన డ్యాన్స్ లకి అక్కడ ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పాటలకు డ్యాన్స్ లు వేసి జపాన్ ఫ్యాన్స్ సందడి చేస్తుంటారు. తారక్ నటించిన 'బాద్ షా' చిత్రం జపాన్ లోనూ విడుదలై అక్కడి వారిని ఆకట్టుకుంది. జపాన్ మీడియా హైదరాబాద్ వచ్చి మరీ తారక్ ని కలిసిన సందర్భాలు ఉన్నాయి. అయితే జపాన్ లో తారక్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందనేది మరోసారి రుజువైంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి రూపొందించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈ చిత్రం రేపటి(అక్టోబర్ 21) నుంచి జపాన్ థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తారక్, చరణ్, రాజమౌళి జపాన్ వెళ్లగా అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా తారక్ అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. తారక్ బస చేస్తున్న హోటల్ లో ఒక లేడీ ఫ్యాన్ బ్యూటిఫుల్ మెసేజ్ తో తను స్వయంగా తయారు చేసిన లెటర్ ని తారక్ కి ప్రజెంట్ చేసింది. ఆమె అభిమానానికి తారక్ ఫిదా అయిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

'ఆర్ఆర్ఆర్'తో తారక్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన డ్యాన్స్ లు, ఎనర్జీతో జపాన్ లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న తారక్.. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'తో మరో స్థాయికి వెళ్ళే అవకాశముందని అంటున్నారు. గతంలో తారక్ సినిమాలలోని పలు పాటలకు డ్యాన్స్ లు వేసిన జపాన్ ఫ్యాన్స్.. ఇప్పుడు 'నాటు నాటు'తో అక్కడ మోత మోగిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



