సూర్యతో బోయపాటి యాక్షన్ డ్రామా?
on Jan 22, 2021
మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ప్రస్తుతం తన లక్కీ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణతో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఉగాది కానుకగా ఏప్రిల్ లో విడుదల కానుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలయ్యేలోపే బోయపాటి నెక్ట్స్ వెంచర్ ఫిక్స్ అయిపోయిందట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. కోలీవుడ్ స్టార్ సూర్య తో బోయపాటి తదుపరి చిత్రం ఉంటుందని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని.. కొన్నాళ్ళ క్రితం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం తయారుచేసుకున్న యాక్షన్ కథనే ఇప్పుడు సూర్య తో బోయపాటి చేయబోతున్నాడని వినికిడి.
మొత్తమ్మీద.. తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలన్న సూర్య కల నెరవేరబోతోందన్నమాట. త్వరలోనే సూర్య, బోయపాటి కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.