"హ్యాపీ బర్త్‌డే బాస్ లేడీ".. నమ్రతకు మహేశ్ విషెస్!
on Jan 22, 2021
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో మహేశ్, నమ్రతా శిరోద్కర్ కపుల్ ముందు వరుసలో ఉంటుంది. మహేశ్‌కు అమేజింగ్ లైఫ్ పార్టనర్ అయిన ఆమె ఇద్దరు పిల్లలకు తల్లిగా తన బాధ్యతలను గొప్పగా నిర్వర్తిస్తున్నారు. మహేశ్ స్టార్డమ్ వెనుక ఆయన స్వయంకృషి ఎంత ఉందో, భార్యగా నమ్రత సపోర్ట్ అంతగానూ ఉంది. ఒకరికి ఒకరు అన్నట్లుగా కనిపించే ఆ జంటను ఇష్టపడని వాళ్లెవరు! 2005లో ఏడడుగులు నడిచిన ఆ జంటకు కుమారుడు గౌతమ్, కుమార్తె సితార ఉన్నారు.
బ్యూటిఫుల్ నటి నమ్రత ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన ప్రియమైన అర్ధాంగికి మహేశ్‌బాబు తనదైన స్టైల్లో శుభాకాంక్షలు తెలియజేశాడు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో నమ్రతతో ఓ సందర్భంలో పంచుకున్న ఆనంద క్షణాలకు చెందిన ఓ పిక్చర్‌ను షేర్ చేశాడు.
నమ్రతను "బాస్ లేడీ" అని సంబోధిస్తూ, "Someone I love was born today! Everyday with you is special but today is a little more!! Celebrating my amazing woman. Happy birthday, boss lady." అంటూ రాసుకొచ్చాడు. ఆ పిక్చర్లో మహేశ్ నవ్వుతూ సెల్ఫోన్లో ఏదో చూపిస్తుంటే, దాన్ని చూసి నమ్రత కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. క్యాజువల్ డ్రస్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తున్న ఆ ఇద్దరి కళ్లకూ గాగుల్స్ ఉన్నాయి. ఆ పిక్చర్‌లోని హైలైట్ హాయిగా నవ్వుతూ ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తుండటం!
ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మహేశ్ షేర్ చేసిన ఈ పోస్ట్‌కు కామెంట్స్ సెక్షన్లో స్పందించారు నమ్రత. "Thank you for making every year so special" అంటూ రెండు రెడ్ హార్ట్ ఎమోటికాన్స్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.