ENGLISH | TELUGU  

ఆస్కార్ క‌మిటీలో చేరుతున్న తొలి ద‌క్షిణాది న‌టుడు సూర్య‌!

on Jun 30, 2022

 

ప్రతిష్టాత్మక గౌరవాలలో ఒకటైన ఆస్కార్ క‌మిటీలో చేర‌డానికి ఆహ్వానం అందుకున్నాడు హీరో సూర్య‌. అకాడమీ ఆహ్వానానికి ప్రతిస్పందిస్తూ, ఈ గౌరవానికి ధన్యవాదాలు తెలిపేందుకు ట్విట్టర్‌ను వేదిక‌గా చేసుకున్నాడు. ఆ ఆహ్వానాన్ని అంగీకరించి, తన అభిమానులను గర్వపడేలా కృషి చేస్తానని ప్రామిస్ చేశాడు. ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన‌ తన 'తమ్ముడు' సూర్యను ట్విట్ట‌ర్ ద్వారా అభినందించాడు లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌. 

ఆస్కార్ క‌మిటీలో చేర‌డానికి ఆహ్వానం అందుకున్న తొలి ద‌క్షిణాది న‌టునిగా సూర్య కీర్తిని సంపాదించాడు. ఆ న్యూస్ ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌చ్చిందో, అప్ప‌ట్నుంచీ ఆయ‌న‌ను అభినందిస్తూ అన్ని వైపుల నుంచీ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

జూన్ 29న అకాడ‌మీ ఇన్విటేష‌న్‌కు రెస్పాండ్ అయ్యాడు సూర్య‌. "Thank you @TheAcademy for the invitation, which I humbly accept. My heartfelt thanks to all those who wished me, will always strive to make you all proud!! (sic)." అని ఆయ‌న ట్వీట్ చేశాడు. ఆస్కార్ క‌మిటీలో బాలీవుడ్ సెల‌బ్రిటీలు కాజోల్‌, రీమా క‌గ్తితో పాటు సూర్య‌ భార‌త్‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నాడు.

'విక్ర‌మ్‌'తో ఇటీవ‌ల బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్న క‌మ‌ల్ హాస‌న్‌, త‌న త‌మ్ముడిని ట్విట్ట‌ర్ ద్వారా అభినందించాడు. 'విక్ర‌మ్‌'లో ఆ ఇద్ద‌రూ స్క్రీన్‌ను పంచుకున్న విష‌యం తెలిసిందే. "Glad my brother @Suriya_offl treads the ground of stars. In spite of gravity, which makes wings weak. We created angels and stars. Hence be proud brother to join the crowd of excellence (sic)." అని రాసుకొచ్చాడు క‌మ‌ల్‌. ఆ పోస్ట్‌ను రిట్వీట్ చేసిన సూర్య "థాంక్యూ అన్నా" అని రాశాడు.

'విక్ర‌మ్' మూవీలో ఐదు నిమిషాల సేపు క‌నిపించే రోలెక్స్ అనే రోల్‌లో క‌నిపించి, ప్రేక్ష‌కుల్ని అమితంగా అల‌రించాడు సూర్య‌. 'విక్ర‌మ్' సీక్వెల్‌కు లీడ్‌ను ఇచ్చేది ఆయ‌న పాత్రే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.