ప్రాణాపాయ స్థితిలో ఫ్యాన్.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్
on Jun 30, 2022

ఆపదలో ఉన్న అభిమానులకు అండగా నిలవడంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఓ అభిమానికి తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చాడు.
శ్రీకాళహస్తికి చెందిన జనార్ధన్ అనే ఎన్టీఆర్ అభిమాని ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది. ప్రస్తుతం కోమాలో ఉన్న అతను బ్రతకడానికి పోరాటం చేస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు ఇలా ఆస్పత్రి బెడ్ పై చావుబతుకుల మధ్య ఉండటంతో అతని తల్లి ఎంతగానో రోధిస్తోంది. ఈ విషయం అభిమాన సంఘాల ద్వారా ఎన్టీఆర్ కు చేరడంతో ఆయన.. అభిమాని తల్లితో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పాడు. మీ కుమారుడికి ఏమి కాదని, తామంతా ఉన్నామని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చాడు.

అలాగే అభిమానితో కూడా మాట్లాడి ధైర్యాన్ని నూరి పోశాడు తారక్. లౌడ్ స్పీకర్ ఆన్ చేసి ఫోన్ అభిమాని దగ్గర ఉంచగా.. "నీకేం కాదు.. నీకు నేనున్నాను.. త్వరగా కోలుకొని వచ్చేసేయ్, మనం కలుద్దాం" అంటూ అభిమానికి ధైర్యం చెప్పాడు. ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో జనార్ధన్ చేతి వేళ్ళు కదిలించినట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



