‘మా వరకు అసలు అవకాశాలు రావట్లేదు’ అందుకే నటించడం లేదు
on Oct 7, 2022
సురేఖావాణి మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ పేరు తెచ్చుకున్న నటి. ఈమె హీరోయిన్ కాకపోయినా మూవీ ఈమె చేసే రోల్స్ భలే నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఈమె ఎన్నో మూవీస్ లో చేశారు. మూవీస్ లో చేస్తూ ఇటు సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తూ ఉంటుంది. ఈమె కూతురు సుప్రీతా. ఇద్దరూ ఫుల్ జోష్ లో వుంటారు ఎప్పుడూ. ఐతే ఈమధ్యన సురేఖావాణి సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఐతే చాలా ఏళ్ళ తర్వాత రీసెంట్ గా రిలీజ్ ఐన "స్వాతిముత్యం" మూవీలో సురేఖావాణి నటించింది.
దసరా సందర్భంగా రీలీజ్ ఐన ఈ మూవీకి సంబంధించి సక్సెస్ మీట్ లో సురేఖవాణి తను సినిమాలు ఎందుకు చేయట్లేదనే దాని గురించి మాట్లాడింది. ‘చాలామంది సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతున్నారు. అసలు మాదాకా వస్తే కదా మేం చేయడానికి ? మా వరకు అసలు అవకాశాలు రావట్లేదు. అలా ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. నేను సినిమాలు మానేశానని అనుకుంటున్నారు. కానీ కాదు. మంచి ఛాన్సులు వస్తే తప్పకుండా నటిస్తా. నేను సినిమా అమ్మాయిని. సినిమా కోసమే వున్నాను. సినిమాలు చేస్తూనే ఉంటాను. నాకు ‘స్వాతిముత్యం’లో ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు థాంక్స్’ అని చెప్పింది సురేఖావాణి.
Also Read