సూపర్ స్టార్ రజనీకాంత్ కు కోర్ట్ నోటీసులు..!
on Mar 30, 2016

సూపర్ స్టార్ రజనీకి బెంగుళూరు స్థానిక కోర్టు నోటీసులు జారీ చేసింది. తినడానికి, తాగడానికి లేక ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతుండగా, కటౌట్ లకు లీటర్ల కొద్దీ పాలు వృథా చేయడమేంటని మణివణ్ణన్ అనే వ్యక్తి, వేసిన పిటిషన్ ను కోర్ట్ స్వీకరించింది. పోషకాహారం లేక దేశంలో వేలాది మంది పిల్లలకు సరైన ఎదుగదల కూడా లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఇదే విషయమై కోర్టులో పిటీషన్ వేశారు. మార్చి 26న వేసిన కేసు 30న విచారణకు వచ్చింది. కటౌట్లకు పాలాభిషేకం ఒక్క రజనీ విషయంలోనే కాదు కదా, దేశంలో చాలామంది నటీనటులకు జరుగుతోంది కదా అని ప్రశ్నించిన కోర్టుకు, రజనీ లాంటి స్టార్, ఇలాంటివి వద్దు అని చెబితే దేశంలో మిగిలిన నటీనటులకు కూడా అది ఆదర్శప్రాయంగా ఉంటుంది అని పిటిషనర్ జవాబిచ్చారు. దీంతో కోర్టు, సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ విషయమ్మీద తన అభిప్రాయం తెలపాలని నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 11న ఈ కేసును వాయిదా వేసిన కోర్టు వాయిదా పడింది. మరి రజనీ ఈ విషయమ్మీద స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



