త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నితిన్ కు హ్యాపీ బర్త్ డే..!
on Mar 30, 2016
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నితిన్ కూడా ఒకడు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో అ..ఆ చేస్తున్న నితిన్ కు పెళ్లి కుదిరిందా..? ఏమో..సమంత ట్వీట్స్ చూస్తే అలాగే అనుకోవాలి మరి. హీరోయిన్ సమంత మొన్నామధ్య సడెన్ గా ట్విట్టర్ వదిలేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా మళ్లీ ట్విట్టర్ పట్టుకున్న సామ్, ట్వీట్స్ లో యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం సమంత కూడా నితిన్ తో అ..ఆలో యాక్ట్ చేస్తోంది. అలాంటి సమంత త్వరలోనే పెళ్లికొడుకు కాబోతున్న అని ట్వీటిందంటే, ఎవరికైనా ఏమనిపిస్తుంది..? ఇద్దరూ కలిసే సినిమా చేస్తున్నారు కదా..నితిన్ తన పెళ్లి విశేషాలు సమంతతో షేర్ చేసుకుని ఉంటాడు అనే కదా డౌట్ వస్తుంది. ప్రస్తుతం సమంత ట్వీట్ చూసిన వారందరిదీ ఇదే సందేహం. నితిన్ పుట్టినరోజున, హ్యాపీ బర్త్ డే టు నితిన్, వండర్ ఫుల్ వండర్ ఫుల్ కోస్టార్, స్వీట్ జెన్యూన్ టాలెంటెడ్ ఫన్ అని విశేషణాలతో పొగిడి, చివరిలో సూన్ టు బీ మ్యారీడ్ అని పెట్టింది. దీంతో ఇప్పుడు సమంత పాలోవర్లతో పాటు, నెటిజన్లందరికీ ఒకటే డౌటు. నితిన్ కు పెళ్లి సెట్టయిందా లేక సినిమాలో పెళ్లి సీన్ ఉంటుందా..? లెట్స్ వెయిట్ అండ్ సీ..
Also Read