తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ!
on Nov 14, 2022

సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు కాంటినెంటల్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కొంతకాలంగా ఘట్టమనేని కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 2019 లో కృష్ణ రెండో భార్య విజయనిర్మల మృతి చెందగా.. ఈ ఏడాది పెద్ద కుమారుడు రమేష్ బాబు, మొదటి భార్య ఇందిరా దేవి అనారోగ్యంతో మరణించారు. వరుస విషాదాలతో కృష్ణ కృంగిపోయారని తెలుస్తోంది. దానికితోడు వయసు మీద పడుతుండటంతో ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. అందుకే ఆయన ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతతో కృష్ణ ఆసుపత్రిలో చేరారన్న వార్తతో ఘట్టమనేని అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



