కృష్ణ ఆరోగ్యంపై స్పందించిన నరేష్!
on Nov 14, 2022

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. కృష్ణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, 24 గంటల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు.
కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరినట్టు ఈ ఉదయం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో కృష్ణ ఆరోగ్యంపై నరేష్ స్పందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆదివారం ఆస్పత్రిలో చేర్పించామని, 24 గంటల్లో డిశ్చార్జ్ అవుతారని అభిమానులకు భరోసా ఇచ్చారు. మరోవైపు కృష్ణ సన్నిహిత వర్గాల సైతం ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



