భార్యాభర్తలకు టిప్స్ ఇస్తున్న సన్నీ లియోన్..!
on Jun 4, 2016
.jpg)
సన్నీ లియోన్ అంటే కేవలం అడల్డ్ స్టార్ మాత్రమే కాదు. సున్నితమైన భావాలున్న మహిళ కూడా. చాలా సార్లు తనకున్న సోషల్ మీడియా ద్వారా సమకాలీన అంశాలపై స్పందిస్తుంటుంది సన్నీ. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్రేకప్స్ అనేవి చాలా కామన్ గా మరిపోయాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్న జంటలు కూడా పట్టుమని పది నెలలు కలిసుండటం లేదు. ఈ విషయమై పెళ్లయిన తర్వాత కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ పరిస్థితి రాదని చెబుతోంది సన్నీ లియోన్. " ముఖ్యంగా భార్యాభర్తల మధ్య నమ్మకం, కాస్త రాజీ పడే తత్వం ఉండాలట. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఆ బంధం చెక్కుచెదరదు. ముఖ్యంగా రాజీపడటం నేర్చుకోవాలి. ప్రతీసారీ ఇద్దరి మాటా నెగ్గదు. వాదనలు వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు రాజీ పడటం ద్వారా ఆ పరిస్థితిని నివారించవచ్చు. ముఖ్యంగా భార్యను హ్యాపీగా ఉంచేవాళ్ల లైఫ్ ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది. మా జంటే అందుకు ఉదాహరణ " అని చెబుతోంది సన్నీ. మరి సన్నీ వీరాభిమానులందరూ ఈ టెక్నిక్స్ ఫాలో అవుతారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



