ఆహా..ఏమి ఫోటో గురూ..!
on Jun 4, 2016
సినీ ఫ్యామిలీల్లో అత్యంత అందమైన కుటుంబం అక్కినేని వారిది అంటుంటారు సినీజనాలు. ముఖ్యంగా వీళ్ల ఫ్యామిలీకి ఏజ్ అవదు. ఎన్నేళ్లు వచ్చినా, ముఖం అంతే అందంగా, యవ్వనంగా ఉంటుంది. ఎఎన్నార్ ది అదే బాట. ఆయన తనయుడు నాగార్జునదీ అదే బాట. అఖిల్, చైతన్యలకు నాగార్జున తండ్రిలా కంటే, అన్నయ్య లా కనిపిస్తారు. మరి ఈ అక్కినేని ఫ్యామిలీ అందగాళ్లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది.. ఇదిగో ఈ ఫోటోలా ఉంటుంది.

లేటెస్ట్ గా ఒక మ్యాగజైన్ కవర్ ఫోటో కోసం ఈ స్టిల్ ఇచ్చారు ఆ తండ్రీ కొడుకులు. చూడటానికి యాజ్ ఇటీజ్ మనం పోస్టర్లా ఉంది. ఒక్క నాగేశ్వరరావుగారు మాత్రం మిస్ అయ్యారు. ఈ ముగ్గుర్నీ ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే, అక్కినేని అభిమానులకు ఆనందానికి అవధుల్లేవు. నాగ్ లుక్ పరంగా క్లాస్ గా కనిపిస్తుంటే, చైతూ కాస్త గడ్డంతో రఫ్ లుక్ ఇచ్చాడు. ఏదేమైనా, అక్కినేని అందమే వేరబ్బా అంటున్నారు ఫోటో చూసిన వాళ్లు. కరెస్టే కదా మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



