"కొడకా" అనడానికి సిగ్గుపడ్డ పవన్
on Dec 28, 2017
.jpg)
పవన్‌కు సిగ్గు ఎక్కువనే సంగతి ఆయన సన్నిహితులతో పాటు అభిమానులందరికీ తెలుసు. నలుగురితో కలవడానికి కూడా ఆయన బాగా మొహమాట పడతారు. షూటింగ్ టైంలో కూడా అందరిముందు నటించడానికి కాస్తంత నెర్వస్‌గా ఫీలవుతారు. ఉదాహరణకి అత్తారింటికి దారేది షూటింగ్‌లో భాగంగా స్విట్జర్లాండ్‌కి వెళ్లిన చిత్ర యూనిట్ అక్కడ ఓ పాటను షూట్ చేయడానికి అన్ని రెడీ చేసింది. అయితే అదే సమయంలో అక్కడ పబ్లిక్ ఎక్కువగా ఉండటంతో వారి ముందు పవన్ డ్యాన్స్ చేయలేక.. సిగ్గుతో కార్‌వాన్‌లో కూర్చున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి కోసం ఓ పాట పాడారు పవర్‌స్టార్.
ఇప్పటికే సినిమాలోని అన్ని ఆడియో ట్రాక్స్ బయటికి వచ్చేయగా.. పవన్ పాడిన కొడకా కోటేశ్వరరావు పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటలకు ఈ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన సాంగ్ టీజర్‌ను హారికా హాసిని క్రియేషన్స్ నిన్న విడుదల చేసింది. ఇందులో త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ దగ్గరుండి పవన్‌తో పాట పాడించి రికార్డ్ చేశారు. పాటను హుషారుగా మొదలుపెట్టిన పవర్‌స్టార్ పల్లవిలోని కొడకా అన్న పదం పలకడానికి సిగ్గుపడ్డారు. మొహమాటపడుతూ.. నవ్వుతూ.. కష్టపడి ఎలాగోలా పాటను పూర్తిచేశారు పవన్‌కళ్యాణ్. ఇప్పుడు ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



