సునీల్ కొత్త సినిమా ' జక్కన్న ' పోస్టర్ టాక్
on Mar 18, 2016
హీరోగా మారిన తర్వాత సునీల్ కు స్టార్ పెద్దగా కలిసిరావట్లేదు. అందాల రాముడు, మర్యాద రామన్న తప్పితే చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. మొన్న వచ్చిన కృష్ణాష్టమి కూడా నిరాశే మిగిల్చింది. అందుకే ఈసారి తనకు మర్యాదరామన్న నిచ్చిన రాజమౌళి ముద్దుపేరు మీదుగా జక్కన్న అంటూ వస్తున్నాడు. ప్రేమకథా చిత్రమ్ నిర్మాత సుదర్శన్ రెడ్డి, ' రక్ష ' సినిమా దర్శకుడు ఆకెళ్ల వంశీకృష్ణ, సునీల్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. బ్యాగ్ పట్టుకుని ఎక్కడి నుంచో వస్తున్నట్టుగా సునీల్ స్టిల్ ఉంది.

ఈ లుక్ పై ఇప్పుడు సునీల్ మీద నెట్ లో సెటైర్లు పడుతున్నాయి. సినిమా ఎలాగూ రొటీన్ గా తీస్తున్నావు, కనీసం ఫస్ట్ లుక్ అయినా వెరైటీగా ప్లాన్ చేయచ్చు కదా..ఎప్పుడూ అదే బ్యాగూ, అదే స్టిల్లా అంటూ నెటిజన్లు సునీల్ పై కామెడీ చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే అది కూడా పాయింటే మరి. మర్యాద రామన్న, పూల రంగడు, నిన్న మొన్నొచ్చిన కృష్ణాష్టమి, ఇప్పుడు జక్కన్న..ఈ నాలుగు సినిమాల్లోనూ కామన్ పాయింట్ సునీల్ బ్యాగే. అన్నింటిలోనూ సిటీ నుంచి విలేజ్ కు ట్రావెల్ అయ్యే కాన్సెప్టే. మరి జక్కన్నలో అయినా, ఏమైనా సునీల్ బాబు ఏమైనా డిఫరెన్స్ చూపిస్తాడేమో చూడాలి. అన్నింటికీ మించి తన మార్క్ కామెడీని తిరిగి అందిపుచ్చుకోవడం సునీల్ కు ఇప్పుడు ఎంతైనా అవసరం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



