బాలీవుడ్ మూవీ ' కపూర్ అండ్ సన్స్ ' రివ్యూ
on Mar 18, 2016

ఈరోజే రిలీజైన బాలీవుడ్ మూవీ కపూర్ అండ్ సన్స్ మంచి రివ్యూలు సాధిస్తోంది. రిషీ కపూర్ 90 ఏళ్ల వృద్ధుడి గెటప్ లో కనిపించి అలరించిన ఈ మూవీ, ఈ ఏడాది నీర్జాకు ఉత్తమ చిత్రం కేటగిరీలో పోటీనిస్తుందంటున్నారు విశ్లేషకులు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మించిన కపూర్ అండ్ సన్స్ ఎలా ఉందంటే..
కథ
అర్జున్ కపూర్ (సిద్ధార్ధ్ మల్హోత్రా) , రాహుల్ కపూర్ (ఫవాద్ ఖాన్) అన్నదమ్ములే కానీ ఎప్పుడూ గొడవ పడుతుంటారు. వాళ్ల తల్లిదండ్రులిద్దరికీ మధ్య కూడా ఎప్పుడూ ఏదొక గొడవ నడుస్తుంటుంది. ఒకసారి వాళ్ల తాతగారు అమర్ జీత్ కపూర్ (రిషీ కపూర్) ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఫ్యామిలీ అంతా ఆయన చూడటానికి తమ చిన్నప్పటి ఇంటికి చేరుకుంటారు. అసలే గొడవలు పడే బ్రదర్స్ ఇద్దరూ కలిసి ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఇంతకూ ఆ అమ్మాయి ఎవరికి దక్కింది. వాళ్ల తల్లిదండ్రుల మధ్య గొడవలు ఎలా తగ్గాయి. వీటికోసం వాళ్ల తాత ఏం చేశాడు అన్నదే సినిమా కథ. ఫస్ట్హాఫ్ అంతా బ్రదర్స్ మధ్య గొడవలతో, సెకండ్ హాఫ్ అంతా ట్విస్టులతో నడుస్తుంది. కామెడీ, లవ్ తో సినిమా అంతా సాగిపోయి, చివరికి వచ్చేసరికి భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తాయి. సిద్ధార్ధ్, ఫవాద్ ఖాన్, అలియాలు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాకు హైలెట్ రిషీ కపూర్ క్యారెక్టర్. 90 ఏళ్ల వృద్ధుడిలా ఆయన నటించిన తీరు అద్భుతం. దర్శకుడు షకూన్ బాత్రా అద్భుతమైన కథను రాసుకున్నాడు. దాన్ని టైట్ స్క్రీన్ ప్లే, కామెడీ తో చివరివరకూ వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు.
ప్లస్-మైనస్:
కథ, సిద్ధార్ధ్ అలియా భట్ ల కెమిస్ట్రీ, క్లైమాక్స్ సీన్స్ సినిమాకు హైలెట్స్. ఫస్ట్ హాఫ్ లో స్లోనేరేషన్ మైనస్.
తెలుగువన్ వ్యూ :
బాలీవుడ్ లో అరుదైపోయిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



