మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ కథ ఏంటి?
on Jan 26, 2026
మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు జనవరి 26. ఈ సందర్భంగా అతని 77వ సినిమా టైటిల్‌ను రివీల్ చేసింది చిత్ర యూనిట్. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇరుముడి అనేది అయ్యప్ప స్వామి భక్తులకు ఎంతో పవిత్రమైంది. సినిమాకి ఈ టైటిల్ పెట్టారంటే కథలో ఆధ్యాత్మికతతో కూడిన బలమైన కథ ఉంటుందని అర్థమవుతుంది.
సాధారణంగా రవితేజ సినిమాలు పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల్లో జోష్ పెంచేలా ఉంటాయి. అయితే దానికి భిన్నంగా అతని 77వ సినిమాకి ఇరుముడి అనే టైటిల్ పెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు రవితేజ చేసిన 76 సినిమాల్లో ఏ సినిమాకీ ఈ తరహా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో అయ్యప్ప స్వాముల మధ్యలో తలపై ఇరుముడితో ఓ పాపను ఎత్తుకొని కనిపిస్తున్నారు రవితేజ.
‘ఇరుముడి’ ఫస్ట్ లుక్‌లోనే ఇది తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే ఓ ఎమోషనల్ డ్రామా అనే హింట్ ఇచ్చారు శివ నిర్వాణ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే ఓ విభిన్నమైన సినిమా కాబోతోంది. ‘కొన్ని కథలు సరైన సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయి’ అంటూ ఈ సినిమాపై తనకు ఉన్న కాన్ఫిడెన్స్‌ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు రవితేజ. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో సాయికుమార్, అజయ్ ఘోష్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



