హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా SSMB29..!
on Apr 20, 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటే స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం 'SSMB29' అనే వర్కింగ్ టైటిల్ తో యాక్షన్ అడ్వెంచర్ గా దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. హైదరాబాద్, ఒడిశాలో ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
'SSMB29' నెక్స్ట్ షెడ్యూల్ మే నుంచి జూన్ వరకు హైదరాబాద్ లో జరగనుందట. ఈ షెడ్యూల్ లో ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారని సమాచారం. మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ తో పాటు దాదాపు మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ లు ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారని వినికిడి. ఈ బోట్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ను సిద్ధం చేస్తున్నారట. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో ఈ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు రాజమౌళి. ఇప్పుడు 'SSMB29'తో మరోసారి గ్లోబల్ వైడ్ గా రాజమౌళి పేరు మారుమోగిపోవడం ఖాయం అంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో.. అంతకు కొన్ని రెట్లు 'SSMB29' బోట్ సీక్వెన్స్ కి రావడం ఖాయమని చెబుతున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
