ఓదెల 2 రెండు రోజుల కలెక్షన్స్ ఇవేనా!
on Apr 19, 2025

శివశక్తిగా బైరవి అనే క్యారక్టర్ లో తమన్నా(Tamannaah)నటించిన చిత్రం ఓదెల 2 (Odela 2). ఈ నెల 17 న విడుదలైన ఈ మూవీకి రామ్ చరణ్(Ram Charan)కి రచ్చ లాంటి హిట్ ని ఇచ్చిన దర్శకుడు సంపత్ నంది(Sampath Nandi)రచనా, దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు. హెబ్బాపటేల్, వశిష్ట సింహ, మురళి శర్మ, నాగ మహేష్ శ్రీకాంత్ అయ్యంగార్, పూజారెడ్డి, యువ, వంశీ, శరత్ లోహితష్వ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించగా అశోక్ తేజ దర్శకుడిగా వ్యవహరించాడు.
ఈ మూవీ తొలిరోజు 0 .85 కోట్ల రూపాయలని అందుకోగా రెండవ రోజు 0 .59 కోట్ల రూపాయలని సాధించింది. దీంతో మొత్తం రెండు రోజులకి 1 .44 కోట్ల రూపాయల్ని సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు వారు చెప్తున్నారు. ప్రేక్షకుల నుంచి అయితే ఓదెల 2 కి మిక్స్డ్ టాక్ వస్తుంది. ఈ నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి.
ఓదెల' గ్రామంలో తిరుపతి అనే రేపిస్టుని భార్య రాధ చంపేస్తుంది. కానీ గ్రామస్థులు తిరుపతి ఆత్మకి శాంతి లేకుండా చెయ్యాలని శవాన్ని కాల్చకుండా నిలువుగా నుంచో బెట్టి శవశిక్ష వేస్తారు. కానీ మళ్ళీ తిరుపతి వేరే వాళ్ళ శరీరాల్లోకి ప్రవేశించి శోభనపు పెళ్లి కూతుళ్ళని మానభంగం చేసి చంపుతుంటాడు. పైగా క్షుద్ర విద్యలని కూడా నేర్చుకొని మరింత బలవంతుడుగా మారతాడు. దీంతో ఊరుని కాపాడటానికి శివశక్తి గా మారిన భైరవి ఓదెల వచ్చి తిరుపతి నుంచి ఊరిని ఎలా కాపాడిందనే కథాంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



