ఆగస్ట్‌లో సెట్స్ మీదకు SSMB 28.. హీరోయిన్‌గా పూజ కన్ఫామ్!
on Jul 9, 2022
.webp)
సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో రూపొందనున్న మూడో చిత్రం షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించే ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. 'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలిసి పనిచేస్తున్న సినిమా ఇది. అలాగే 'మహర్షి' లాంటి హిట్ సినిమాలో తొలిసారి జంటగా నటించిన మహేశ్, పూజా ఈ సినిమాలో మరోసారి జతకడుతున్నారు.
ఈ మూవీ ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందనీ, రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్‌లో మొదలవుతుందనీ తెలియజేస్తూ ఓ వీడియోను నిర్మాతలు విడుదల చేశారు. తమన్ సంగీత దర్శకుడిగా, నవీన్ నూలి ఎడిటర్‌గా, ఎ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా, పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ మూవీ విడుదలవుతుందని కూడా అందులో తెలియజేశారు.
ఈ వీడియోను పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేసి, ఆనందం పంచుకుంది. వరుస ఫ్లాపులను ఎదుర్కొంటున్న పూజా ఈ సినిమాలో ఉంటుందో, లేదోననే సందేహాలు ఇటీవల వ్యక్తమవుతూ వచ్చాయి. అయితే అదంతా వట్టిదేననీ, ఇందులో తాను నటిస్తున్నానని ఆ వీడియోను షేర్ చేయడం ద్వారా స్పష్టం చేసింది పూజ.
మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కాంబినేషన్‌లో వచ్చిన `అతడు`, `ఖలేజా` చిత్రాలు నేటికీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాయి. దశాబ్ద కాలానికి పైగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రారంభం అవుతోంది అన్న వార్త అభిమానుల ఆనందాన్ని అంబరాన్ని తాకేలా చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



