అంతర్జాతీయ వేదికపై రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్
on Dec 3, 2022

అమెరికాలో పేరెన్నికగన్న న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) ప్రకటించిన అవార్డుల్లో యస్.యస్. రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దక్కింది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ పలు అవార్డులను ప్రకటించింది. 2023 ఆస్కార్ నామినేషన్స్‌ను ఇవి ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' మూవీకి గాను రాజమౌళికి ఉత్తమ దర్శకుడి పురస్కారం లభించింది.
అల్లూరి సీతారామరాజు, కొమరం భీం గురించి తెలిసిన తెలుగు సినీ విశ్లేషకులు, విమర్శకులు పెద్దగా 'ఆర్ఆర్ఆర్'ను మెచ్చుకోకపోయినా, వాళ్లెవరో తెలీని ఇతర భాషల విమర్శకులు, అంతర్జాతీయ సినీ విమర్శకులు 'ఆర్ఆర్ఆర్'ను తెగ మెచ్చుకుంటూ వస్తున్నారు. వాళ్ల దృష్టిలో 'ఆర్ఆర్ఆర్' అనేది.. యాక్షన్ మేళవించిన అద్భుతమైన డ్రామా.
ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, రే స్టీవెన్‌సన్, అలీసన్ డూడీ, సముద్రకని నటించిన 'ఆర్ఆర్ఆర్' మూవీకి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చగా, కె.కె. సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



