రాజ్యసభకు రాజమౌళి తండ్రి
on Jul 7, 2022

'బాహుబలి' రచయితగా దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించిన సీనియర్ రైటర్, డైరెక్టర్ వి. విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రతిఫలింపజేస్తాయనీ, అవి ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్రవేశాయనీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో జన్మించిన విజయేంద్రప్రసాద్, తన కథారచనల ద్వారా పలు అవార్డులను గెలచుకుకున్నారు. వాటిలో 2016లో సల్మాన్‌ఖాన్ సినిమా 'బజరంగీ భాయిజాన్' కథారచయితగా అందుకున్న ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా ఉంది. ఆయన కుమారుడు యస్.యస్. రాజమౌళి ఇవాళ దేశంలోని అగ్ర దర్శకుల్లో ఒకరిగా నీరాజనాలు అందుకుంటున్నారు.
రాజమౌళి డైరెక్ట్ చేసిన అత్యధిక సినిమాలకు కథను సమకూర్చింది విజయేంద్రప్రసాదే. వాటిలో ప్రభాస్ నటించిన 'ఛత్రపతి', 'బాహుబలి' రెండు భాగాలు, రామ్‌చరణ్ 'మగధీర', జూనియర్ ఎన్టీఆర్ 'యమదొంగ', రవితేజ 'విక్రమార్కుడు', సునీల్ 'మర్యాదరామన్న', సమంత 'ఈగ', రామ్‌చరణ్-జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' దాకా ఉన్నాయి.
బాలీవుడ్‌లోనూ ఆయన కథలు ప్రేక్షకుల్ని రంజింపజేశాయి. సల్మాన్ ఖాన్ 'బజరంగీ భాయిజాన్', కంగనా రనౌత్ 'మణికర్ణిక' చిత్రాలకు ఆయనే కథలు అందించారు. ఆయన కథతో త్వరలో 'సీత: ది ఇన్‌కార్నేషన్' మూవీ రాబోతోంది. చిత్రాలకు కథలు అందించడంతో పాటు, కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. 2011లో నాగార్జున టైటిల్ రోల్ పోషించిన 'రాజన్న' చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు లభించింది. 'శ్రీకృష్ణ 2006', 'శ్రీవల్లి' అనే చిత్రాలను కూడా విజయేంద్రప్రసాద్ రూపొందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



