సమంత పెంపుడు కుక్కకు థాంక్స్ చెప్పిన చైతన్య!
on Jul 7, 2022
నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'థాంక్యూ'. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సోషల్ మీడియాలో వినూత్నంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
"నా జీవితంలో అతి ముఖ్యమైన వారికి ఈ పోస్ట్ ను అంకితం చేస్తున్నాను. వారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మీరు కూడా మీ జీవితంలో ముఖ్యమైన వారి గురించి చెబుతూ ఫోటోలను షేర్ చేయండి." అంటూ తాజాగా నాగ చైతన్య ట్విట్టర్ వేదికగా ముగ్గురికి థాంక్స్ చెప్పాడు. అందులో అతని తల్లిదండ్రులతో పాటు తన మాజీ భార్య సమంత పెంపుడు కుక్క హష్ ఉండటం విశేషం.
తనను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచిన తన తల్లికి చైతన్య థాంక్స్ చెప్పాడు. అలాగే, ఒక స్నేహితుడు కంటే ఎక్కువగా తనతో ఉంటూ, మార్గ నిర్దేశం చేస్తున్న తన తండ్రి థాంక్స్ చెప్పాడు. అలాగే, ఎలా ప్రేమించాలి? మనిషిగా ఎలా ఉండాలి? అనేది నేర్పించిన హష్ కి కూడా చైతన్య థాంక్స్ చెప్పడం విశేషం. చైతన్య తన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత సమంత పెట్ డాగ్ కి అంతటి ప్రాధాన్యం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
Also Read