రెండో సినిమాకి రెడీ అవుతున్న శ్రీహరి కొడుకు
on Jul 11, 2020

రియల్ స్టార్ దివంగత శ్రీహరి చిన్న కుమారుడు మేఘాంశ్ గత ఏడాది 'రాజ్‌దూత్' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఇంకా టీనేజ్ కూడా దాటని అతను పాతికేళ్ల యువకుడిగా ఆ సినిమాలో కనిపించాడు. రైటర్స్ అర్జున్-కార్తీక్ డైరెక్టర్లుగా పరిచయమైన ఆ మూవీ ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చెయ్యలేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. నటనలో, డైలాగ్ డిక్షన్‌లో పరిణతి సాధిస్తే హీరోగా రాణిస్తాడని మేఘాంశ్ గురించి విమర్శకులు పేర్కొన్నారు.
తొలి సినిమా ఇచ్చిన చేదు అనుభవం నుంచి తేరుకున్న మేఘాంశ్ త్వరలో రెండో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అతని చేతిలో మూడు నాలుగు ఆఫర్లు ఉన్నాయనీ, అయితే ఈసారి సరైన స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని అతను నిశ్చయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం అతని లేటెస్ట్ లుక్ ఫొటోలను మీడియాకు రిలీజ్ చేశారు. జుట్టు పెంచి, గాగుల్స్ పెట్టుకొని దృఢమైన శరీరంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు మేఘాంశ్. రెండో సినిమాతోనైనా అతనికి సక్సెస్ దక్కుతుందని ఆశిద్దాం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



